https://oktelugu.com/

సంచలనం: మరో తెలుగు హీరో హిందీలోకి.. ఏకంగా ‘చత్రపతి’గా..!

చిత్రసీమలో ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. భారీ బడ్జెట్లో తెరకెక్కే సినిమాలన్నీ కూడా ఒక ఇండస్ట్రీకే పరిమితం కాకుండా అన్ని భాషల్లో ఒకేసారి డబ్బింగ్ అవుతూ రిలీజవుతున్నాయి. టాలీవుడ్లోని స్టార్లందరూ కూడా ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. Also Read: రివ్యూ: ‘ఆకాశం నీ హద్దురా’ హిట్టా? ఫ్లాపా? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సూపర్ స్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 12:10 PM IST
    Follow us on

    చిత్రసీమలో ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. భారీ బడ్జెట్లో తెరకెక్కే సినిమాలన్నీ కూడా ఒక ఇండస్ట్రీకే పరిమితం కాకుండా అన్ని భాషల్లో ఒకేసారి డబ్బింగ్ అవుతూ రిలీజవుతున్నాయి. టాలీవుడ్లోని స్టార్లందరూ కూడా ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

    Also Read: రివ్యూ: ‘ఆకాశం నీ హద్దురా’ హిట్టా? ఫ్లాపా?

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలన్నీ కూడా ఇతర భాషల్లోకి డబ్బింగ్ అవుతూ మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. వీరిలాగానే టాలీవుడ్లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు కూడా హిందీలో డబ్బింగ్ అవుతున్నాయి.

    బెల్లకొండ శ్రీనివాస్ సినిమాలకు హిందీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందటంతో ఓ బాలీవుడ్ దర్శకుడు అతడితో ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ముంబైకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బెల్లకొండ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ‘ఛత్రపతి’ సినిమాను హిందీ రీమేక్ చేసేందుకు సన్నహాలు చేస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో విన్పిస్తోంది.

    Also Read: తొలి అనుభవం.. రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర కామెంట్స్

    మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ను ‘ఛత్రపతి’ మూవీ ద్వారా బాలీవుడ్ కు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. అతడి ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని ‘ఛత్రపతి’ రీమేక్ ను హిందీలో చేయాలని సదరు నిర్మాణ సంస్థ భావిస్తుందట. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లు అదుర్స్’ మూవీలో నటిస్తున్నాడు. సంతోష్ శ్రీనివాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు బాలీవుడ్లో సినిమాలు చేసి మళ్లీ తెలుగు సినిమాలకే పరిమితమయ్యారు. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో ఏమేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.