
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు 42వ రోజుకు చేరుకున్నాయి. ఓ వైపు వర్షం, మరోవైపు చలి ఉద్రుతంగా ఉన్నా రైతులు గుడారాల్లో ఉండే నిరసన తెలుపుతున్నారు. మొన్న జరిగిన చర్చలు విఫలం కావడంతో తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అటు రిపబ్లిక్ డే రోజు చేపట్టే ట్రాక్టర్ల ర్యాలీకి రైతులు సిద్ధమవుతున్నారు. మరోవైపుసుప్రీం కోర్టులో వ్యవసాయ చట్టాలపై దాఖలైన అన్ని పిటిషన్లను ఈనెల 11న విచారిస్తామని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా రైతు ఉద్యమాల్లో మావోయిస్టులు చేరారని పంజాబ్ బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రధానితో భేటి అయిన తరువాత బీజేపీ నేత, రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు సూర్జిత్ కుమార్ జ్యానీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.