28న ఏపీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. శాసనసభ్యుల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈనెల 11న నోటిఫికేషన్ రానుండగా 18న నామినేషన్లు దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇదే నెలలో 28న పోలింగ్ నిర్వహించాలని అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన పోతుల సునీత పార్టీ వ్యవహారాలు నచ్చక గత అక్టోబర్లో […]

Written By: Suresh, Updated On : January 6, 2021 3:15 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. శాసనసభ్యుల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన పోతుల సునీత రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈనెల 11న నోటిఫికేషన్ రానుండగా 18న నామినేషన్లు దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇదే నెలలో 28న పోలింగ్ నిర్వహించాలని అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన పోతుల సునీత పార్టీ వ్యవహారాలు నచ్చక గత అక్టోబర్లో తన పదవికి రాజీనామా చేశారు.