
బీహార్‌లోని ముంగర్‌లో జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. దుర్గామాత నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు వీధుల్లోకి వచ్చి పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద చాలా మంది విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాల అద్దాలు పగులకొట్టి సారై మండి వద్ద రోడ్డుపై టైర్లు వేసి మంట పెట్టారు. సమీపంలోని న్యాయమూర్తి బంగ్లా వద్ద కూడా జనం రాళ్లు రువ్వినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ ముంగర్ ఎస్పీని విధుల్లో నుంచి తప్పించింది.