
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించిన గైడ్ లైన్స్ ను కేంద్ర ప్రభుత్వం సోమవారం(డిసెంబర్-14,2020) విడుదల చేసింది. కరోనా నివారణ, వ్యాక్సిన్, పలు స్థాయిల్లో టీకా నిర్వహణ, మానవ వనరులు వారికి శిక్షణ, కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ (CO-WIN) సాఫ్ట్ వేర్, వ్యాక్సిన్ అందించే ప్రక్రియ, టీకా నిల్వలకు సంబంధించిన శీతల గిడ్డంగుల వ్యవస్థ నిర్వహణ, వ్యాక్సిన్ దుష్ప్రభావం ఎదుర్కోవడం, పర్యవేక్షణ వంటి అంశాలకు సంబంధించిన విషయాలను విడుదల చేసిన మార్గదర్శకాలలో పొందుపరిచింది.