Homeజాతీయం - అంతర్జాతీయంబీజేపీకి క్రెడిట్ ఇవ్వడానికి రెడీ : ఉద్ధవ్ థాకరే

బీజేపీకి క్రెడిట్ ఇవ్వడానికి రెడీ : ఉద్ధవ్ థాకరే

కంజూర్‌మార్గ్ మెట్రో కార్ షెడ్ తనకు అహంకారానికి సంబంధించిన అంశం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తాను సిద్ధమేనని తెలిపారు. ఆరే కాలనీలో నిర్మించాలనుకున్న ఈ కార్ షెడ్‌ను కంజూర్‌మార్గ్‌లో నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. లైవ్ వెబ్ కాస్ట్‌లో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, ఒకరి ప్రాజెక్టులను మరొకరు దెబ్బతీయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. కంజూర్ మార్గ్ కార్ షెడ్ భూ వివాదం ప్రజా హితానికి విరుద్ధమన్నారు. ఈ ప్రాజెక్టు క్రెడిట్‌ను ప్రతిపక్షానికి ఇవ్వడానికి తాను సిద్ధమేనని చెప్పారు. ఇది తనకు అహంకారానికి సంబంధించిన విషయం కాదన్నారు. ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పడానికి తగిన దస్తావేజులు ఉన్నాయన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular