ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తమిళనాడు సినీ నటుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఈనెల 31న పార్టీ వివరాలు చెబుతానన్నారు. పార్టీ ఏర్పాటు ఇటీవల ఆయన నాయకులు, అభిమానులతో సమావేశమయ్యారు. అయితే ఆరోజు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ట్విట్టర్ లో రజనీ పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. రజనీ పోస్టుపై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.