తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం తన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో స్నేహితులు, సన్నిహితులలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమని పొలిటికల్ పార్టీ లీడర్ గా చూడాలనుకుంటున్నామని పార్టీ నాయకులు కోరినట్లు సమాచారం. మీరు పార్టీని అధికారికంగా అనౌన్స్ చేస్తే మిగతా సంగతి మేం చూసుకుంటామని పార్టీ నాయకులు చెప్పినట్లు సమాచారం. అయితే తలైవార్ ఆ తరువాత అభిమాన సంఘాలతో కూడా సమావేశమయ్యారు. ఈరోజుల మొత్తం సమావేశాలు నిర్వహించిన తరువాత తలైవార్ భవిష్యత్ కార్యాచరణ పై వెల్లడించే అవకాశం ఉంది. దీంతో తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు రజనీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆయన బీజేపీతో మద్దతుపై ఎలా స్పందిస్తారోనన్న అంశంపై కూడా కమలం నాయకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.