తనను లైంగికంగా వేధించాడని బాలీవుడ్ క్యాస్టూమ్ డైరెక్టర్ ఆయుష్ తివారీపై ఓ బాలీవుడ్ నటి పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించానని, మభ్యపెట్టి రెండేళ్లుగా అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డైరెక్టర్ ఆయుష్ పై 376 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని ముంబైలోని వెర్సోవా పోలీసులు తెలిపారు. ఆయుష్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బెల్ బాటమ్’ సినిమాకు కాస్ట్యూమ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ ప్రముఖులపై లైంగిక వేధింపుల కేసులు నమోదవడం సినీ పరిశ్రమలో విస్మయానికి గురి చేస్తోంది.