
పన్ను ప్రోత్సాహకాల ద్వారా హరిత భవనాల నిర్మాణాల ఆవశ్యకతపై చైతన్యం పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 12వ ‘గృహ’ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడారు. ‘ఏక గవాక్ష విధానంతో హరిత భవనాలకు త్వరితగతిన అనుమతులు అందించాలి. భవిష్యత్తులో నిర్మాణాలు హరిత సాంకేతికతతో కొనసాగేలా మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరగాలి. ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యమివ్వడం మనందరి బాధ్యత’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.