
స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, రిలయన్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్ పతనం కావడంతో ఉదయం మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుంది. చివరకు అతి స్వల్ప లాభాలతో ముగిసింది. నిన్న మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. దీంతో ఉదయం ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. ప్రారంభంలో భారీ నష్టాలకు ఇది కూడా ఓ కారణం. చివరి గంటలో మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ చివరి గంటలో 421 పాయింట్లు పైకి ఎగిసింది.