
చైనా దురాక్రమణ, లడఖ్‌లో సైనికులకు సదుపాయాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకాంశాలపై చర్చించకుండా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి బుధవారం ఆయన వాకౌట్ చేశారు.