
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్-2021 ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ బుధవారం ప్రకటించారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయని ట్విటర్ ద్వారా వెల్లడించారు. అలాగే మొత్తం నాలుగు సార్లు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. తొలిసారి ఫిబ్రవరిలో నిర్వహించనుండగా.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరో మూడు సార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.