
అత్యంత నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ, అందరి ప్రశంసలు పొందుతున్న నెహ్రు జూలాజికల్ పార్కు ఐఎస్ఓ పొందడం ఎంతో హర్షణీయమని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అన్నారు జూ పార్కులో ప్రతీ విభాగంలో పాటించబడుతున్న ఐఎస్ఓ ప్రమాణాలను గుర్తించి వారికి ఈ సర్టిఫికెట్ ప్రధానం చేయటం జరిగిందని మంత్రి తెలిపారు.ముఖ్యంగా శానిటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, యానిమల్ బ్రీడింగ్, జూ హాస్పిటల్, యానిమల్ కేర్, హైజీన్ మెయిన్టెనెన్స్ ఎస్టాబ్లిషమెంట్ లను ఐఎస్ఓ నిపుణుల బృందం తనిఖీ చేసింది.