బీహార్‌లో త్వరలో జరిగే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరుపున పార్టీ ఉపాధ్యక్షుడు ప్రచారంలో పాల్గొననున్నారు. ఈమేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. పార్టీల వర్గారల సమాచారం ప్రకారం ఈనెల 23న ఆయన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రచారంలో రాహుల్‌తో పాటు తేజస్వి యాదవ్ కూడా పాల్గొంటారు. బీహార్ ఎన్నికల్లో ప్రతి విడతకు రెండు ర్యాలీల చొప్పున మొత్తం ఆరు ర్యాలీల్లో రాహుల్ పాల్గొననున్నారు. అయితే ఇదే రోజున బీజేపీ తరురుప మోదీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం మూడు విడతల్లో 12 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారు.