
బీహార్ లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పటికే మంత్రులను పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి తాజాగా ఓ పోలీసు అధికారిని బలి తీసుకుంది. ఫర్నియాలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బినోద్ కుమార్ ఆదివారం ఉదయం కరోనాతో మరణించారు. మూడు రోజుల కిందట కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థతి విషమించడంతో కన్నుమూశారు. కాగా ఇప్పటికే బీహార్లో రాష్ట్ర మంత్రి కపిల్ డియో కామత్, ప్రముఖ నేతలు మరణించారు.