
మహారాష్ట్రలో ఆలయాలు తెరుచుకోవడంపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయాల్లో దర్శనాలకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ పట్టుబట్టడం సరికాదన్నారు. ప్రస్తత పరిస్థితుల్లో సంయమనం పాటించాలన్నారు. కాగా.. గవర్నర్ ముఖ్యమంత్రి పై ‘ బార్లు, రెస్టారెంట్లు తెరిచారు.. కానీ దేవుళ్లను లాక్ డౌన్లో ఉంచమని మీకేమైనా ఆదేశాలున్నాయా..?’ అని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. దీంతో శివసేన నాయకులు దీనిపై మీ స్పందనేంటని అమిత్ షాని ప్రశ్నించగా గవర్నర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.