Modi Shock Trump: అమెరికా అధ్యక్షుడు భారత్ తనకు మిత్రదేశం.. నరేంద్రమోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాడు. పాకిస్తాన్‌తో దోస్తీ చేస్తూ.. భారత్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడు. తాజాగా మోదీ ట్రంప్‌తో మాట్లాడకపోయినా మాట్లాడినట్లు చెప్పుకోవడమే కాకుండా రష్యా నుంచి అయిల్ దిగుమతులు తగ్గిస్తానని చెప్పినట్లు ప్రచారం చేస్తున్నాడు. ఇదే సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నతో ట్రంప్ తడబడ్డాడు. తగ్గించకుంటా భారీగా టారిఫ్‌లు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
టారిఫ్‌ల ప్రభావం..
ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్‌లతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గిపోయాయి. అయితే దేశ జీడీపీపై సరాసరి ప్రభావం పెద్దగా లేదని ఆర్థిక నిపుణలు చెబుతున్నారు. వాణిజ్య సంబంధాలు అమెరికాతో కొంత మందగించినా, భారత్ ఇతర దేశాలతో భాగస్వామ్యాలను విస్తరించడంతో ఎగుమతుల్లో సగటున 23 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఇక రష్యా నుంచి ఆయిల్ దిగుమతులపై భారత్ తనవైఖరిని మరోసారి స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసం ఇంధన దిగుమతులు కొనసాగుతాయని వెల్లడించింది.
సీజ్‌ఫైర్ ప్రయత్నాలు విఫలం..
ఇదిలా ఉంటే ఎన్నికల ముందు ట్రంప్ ‘‘24 గంటల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తా’’ అన్న హామీ ఇచ్చినా, అది అమలుకాలేదు. ఇప్పుడు ఆయన ఇజ్రాయెల్–హమాస్ మధ్య సీజ్‌ఫైర్ ప్రయత్నం చేపట్టి మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. సీజ్‌ఫైర్‌కు నాలుగు దఫాలుగా అమలు చేయాల్సి ఉంది. కానీ మొదటి దశ ఒప్పందం జరిగిన 48 గంటల్లోనే ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులు చేసింది. దీంతో సీజ్‌ఫైర్ అమలుపై అనిశ్చితి నెలకొంది. ఈ సీజ్‌ఫైర్ నాలుగు దశల్లో జరగాలి. మొదటి దశలో ఐడీఎఫ్ వెనక్కి వెళ్లడం, రెండోది ఇరువైపులా దాడులు నిలిపివేయడం, మూడోది మానవతాసాయం పునరుద్ధరించడంతోపాటు పెంచడం, నాలుగోది సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం. కానీ తొలిదశలోనే ఉల్లంఘన జరగడం చర్చనీయాంశమైంది.
గ్లోబల్ ఆర్థిక మార్పులు..
ఇక భారత్ వైపు చూసే సరికి, రిజర్వ్ మేనేజ్‌మెంట్ వ్యూహంలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్ పెద్ద మొత్తంలో డాలర్ కొనడం నిలిపివేసింది. రూపాయి విలువను స్థిరంగా ఉంచేందుకు ఈ చర్య అవసరమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూపాయి విలువ పెరుగితే విదేశీ పెట్టుబడులకు నష్టం, తగ్గితే దిగుమతుల ఖర్చు పెరుగుతుందని, ఈ సున్నిత సమతుల్యాన్ని ఆర్‌బీఐ సున్నితంగా నిర్వహిస్తోంది. డాలర్ డిమాండ్ తగ్గించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ కొంత మొత్తంలో డాలర్లు విక్రయించింది. దీంతో రూపాయి విలువ రూ. 90 మార్కు దాటకుండా ఆపగలిగింది. అదే సమయంలో బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. భారత్ ఇప్పుడు ప్రపంచంలో అధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల్లో తొమ్మిదవ స్థానంలో నిలవడం ఈ వ్యూహం ఫలితం.
టారిఫ్‌లు, యుద్ధాలు, కరెన్సీ ఒత్తిళ్లు ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే భారత్ తనను తాను స్థిరంగా ఉంచుకోవడంలో, వాణిజ్య సమతుల్యతను కాపాడుకోవడంలో ముందు వరుసలో నిలుస్తోంది.