
దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. లాలూకు బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు ఆరు వారాల పాటు వాయిదా వేసింది. లాలూ ప్రసాద్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డుమ్కా ఖజానా నుంచి రూ. 3.13 కోట్ల అక్రమ ఉపసంహరణకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఆయనపై కేసు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి జాయింట్ అఫిడవిట్, లాలూ జ్యుడీషియల్ కస్టడీ పత్రాలను సీబీఐ గురువారం కోర్టుకు అందించింది.