Operation Sindoor Pakistan Soldiers: ఆపరేషన్ సిందూర్.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ ఇది. దీంతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాయి. తర్వాత పాకిస్తాన్ జరిపిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ప్రతిదాడులు చేసింది. దీంతో పాకిస్తాన్‌లోని 11 ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. వందకుపైగా సైనికులు మరణించారు. దీంతో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్.. కాల్పుల విరమణకు వేడుకుంది. దీంతో భారత్ కూడా సీజ్‌ఫైర్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ఓటమిని అంగీకరించడం లేదు. తమవైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రకటించింది. పైగా విజయోత్సవాలు చేసుకుంది. కానీ తర్వాత ఎయిర్ బేస్‌లకు ప్యాచ్ వర్క్‌లు చేపట్టడం ద్వారా అక్కడి పరిస్థితి బయటపడింది. తాజాగా పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోవ్సవం సంరద్బంగా ప్రకటించిన పతకాల జాబితాతో ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన సైనికుల గుట్టు రట్టయింది. పతకాల ప్రదానోత్సవంలో 150 మంది సైనికుల కుటుంబాలకు పతకాలు అందించడం ద్వారా ఈ ఆపరేషన్‌లో వారి సైన్యానికి జరిగిన తీవ్ర నష్టం బహిర్గతమైంది. ఈ 150 మంది సైనికుల పేర్ల పక్కన ‘షహీద్’ అని పేర్కొనడం, వీరంతా భారత సైన్యం నిర్వహించిన దాడుల్లో మరణించినవారని నిర్ధారిస్తోంది. దీంతో ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్తాన్‌పై సాధించిన విజయం ఇప్పుడు స్పష్టమైంది.
Also Read: మహేష్ బాబు ను ఫాలో అయి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు ఎవరో తెలుసా..?
భారత వైమానిక శక్తి ప్రదర్శన..
ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం 90 శాతం పాత్ర పోషించింది. అయితే, పాకిస్తాన్ పతకాల పంపిణీలో వైమానిక దళానికి తక్కువ, సైన్యానికి ఎక్కువ పతకాలు ఇవ్వడం ఆశ్చర్యకరం. ఇది భారత వైమానిక దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఎక్కువ మంది సైనికులు మరణించినట్లు సూచిస్తుంది. ఇంతియాజ్ సనత్, తమ్రాయిత్ జుర్రత్ వంటి పతకాల జాబితాలో ‘షహీద్’ అనే పదం పదేపదే కనిపించడం ఈ వాస్తవాన్ని మరింత బలపరుస్తుంది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం కచ్చితమైన లక్ష్యంతో, అత్యంత ప్రభావవంతంగా దాడులు చేసినట్లు స్పష్టమవుతోంది. అయినా పాకిస్తాన్ బుకాయించింది. పాకిస్తాన్ గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో కూడా తమ సైనికులు పాల్గొనలేదని, ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించిన చరిత్ర ఉంది. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ అదే తరహాలో తమవైపు ఎలాంటి ప్రాణ నష్టం లేదని వాదించింది. కానీ, పతకాల జాబితా ద్వారా ఈ దాపరికం బయటపడింది. పాకిస్తాన్ ఈ రహస్య విధానం, ఓటమిని దాచి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా కనిపిస్తుంది.
భారత్‌లో పారదర్శకత..
మరోవైపు, భారత్ తన సైనికులకు పతకాలు ప్రదానం చేసే విషయంలో పారదర్శకతను పాటించింది. ఆగస్టు 15న జరిగిన సన్మాన కార్యక్రమంలో కీర్తి చక్రలు, వీర చక్రలు, శౌర్య చక్రలు, సేనా మెడల్స్ వంటి అనేక పురస్కారాలను బహిరంగంగా ప్రకటించింది. ఈ పతకాలు అందుకున్న సైనికులు సజీవంగా ఉండటం, వారి ధైర్యసాహసాలను దేశం గౌరవించడం భారత్ యొక్క నిజాయితీని తెలియజేస్తుంది. ముఖ్యంగా, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న 3 వేల మంది అగ్నివీర్‌లు 100 శాతం విజయాన్ని సాధించడం, వారిపై ఉన్న అపోహలను తొలగించింది. రెండేళ్ల క్రితం సైన్యంలో చేరిన ఈ యువ సైనికులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
రెండు దేశాల మధ్య తేడా ఇదే..
ఈ ఘటనలు భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ప్రవర్తనా తేడాలను స్పష్టం చేస్తున్నాయి. భారత్ తన సైనికుల వీరత్వాన్ని బహిరంగంగా గుర్తిస్తూ, వారి సాధనలను సమాజంతో పంచుకుంటుంది. దీనికి విరుద్ధంగా, పాకిస్తాన్ తమ నష్టాలను దాచడానికి, ఓటమిని విజయంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన సైనిక శక్తిని, వ్యూహాత్మక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటింది. అదే సమయంలో, పాకిస్తాన్ యొక్క రహస్య విధానం వారి ఓటమిని మరింత స్పష్టం చేసింది.