Rajinikanth Tweet On Pawan Kalyan: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) సాధారణంగా మన టాలీవుడ్ హీరోల గురించి అరుదుగా మాట్లాడుతూ ఉంటాడు. సోషల్ మీడియా లో ఆయనకు ఎంతమంది శుభాకాంక్షలు తెలియచేసినా, ఆయన మాత్రం కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi), ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కి మాత్రమే రియాక్ట్ అవుతూ ఉంటాడు. అలాంటి సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గురించి ప్రత్యేకించి ట్యాగ్ చేస్తూ కృతఙ్ఞతలు తెలియచేయడం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. విషయం లోకి వెళ్తే ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా దేశం లోని ప్రముఖ స్టార్ హీరోలు, రాజకీయ నాయకులూ, ఇలా ప్రతీ ఒక్కరు శుభాకాంక్షలు తెలియచేశారు. వారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి వారు ఉన్నారు.
Also Read: మహేష్ బాబు ను ఫాలో అయి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు ఎవరో తెలుసా..?
ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్స్ ని క్వాట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపిన సూపర్ స్టార్ రజినీకాంత్, కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ట్వీట్ కి కూడా రెస్పాన్స్ ఇస్తూ ధన్యవాదాలు తెలిపాడు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ట్వీట్లకు క్వాట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియచేసిన రజినీకాంత్, పవన్ కళ్యాణ్ కి మాత్రం ట్వీట్ కి క్వాట్ చేయకుండా, ప్రత్యేకంగా ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియచేసాడు. అంతే కాదు ఆ ట్వీట్ లో ఆయన వాడిన పదాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రప్పించాయి. ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా ప్రియమణిని సోదరుడు, పొలిటికల్ తుఫాన్ పవన్ కళ్యాణ్ నాకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయన మాట్లాడిన మాటలు నా హృదయాన్ని ఎంతో సంతోషపరిచింది. ఆయనకు ఈ సందర్భంగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను’ అంటూ ట్వీట్ వేశాడు.
రజినీకాంత్ పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ తుఫాన్ అంటూ సంబోధించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ ఒక్క పదం ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు పూనకలొచ్చి ఊగిపోతున్నారు. ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇలా ప్రత్యేకంగా ఎలివేషన్ ఇవ్వడాన్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. కూలీ చిత్రం లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి భీభత్సమైన ఎలివేషన్స్ ఇవ్వడానికి ఇండియా లోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరూ అందులో నటిస్తే ఆయన మాత్రం పొలిటికల్ తుఫాన్ అంటూ పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్స్ ఇవ్వడం అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. రజినీకాంత్ వేసిన ఆ ట్వీట్ ని మీరు కూడా చూసేయండి.
Deeply honored and overwhelmed by your kind wishes, respected Deputy Chief Minister of Andhra Pradesh, my dear brother and political Thoofan @PawanKalyan garu
Thank you from the bottom of my heart. God bless. @APDeputyCMO
— Rajinikanth (@rajinikanth) August 17, 2025