Mahesh Babu Followed Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు…సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెను తిరిగి చూడకుండా ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకోబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది…
Also Read: ‘వార్ 2’ ని ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే..సంచలనం రేపుతున్న ఆడియో!!
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమాలను చూసి ఆ సినిమాలను తమిళంలో రీమేక్ చేసి అతని స్టైల్ ని కాపీ చేసి ఒక హీరో స్టార్ హీరోగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే విజయ్… ఇళయ దళపతిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆయన చేసే ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాడు.
ఇక ఆయన చేసిన సినిమాలన్నీ మహేష్ బాబు చేసిన సినిమాలనే రీమేక్ చేయడం విశేషం దానికి తోడుగా మహేష్ బాబు స్టైల్ ని కాపీ చేసి అతని సినిమాలోని కొన్ని సీన్స్ ను వాడుకొని మొత్తానికైతే స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేశాడు. ప్రస్తుతం ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతూ పాలిటిక్స్ లో బిజీ కానున్నాడు…మరి ఏది ఏమైనా కూడా విజయ్ హీరోగా ఎదగడంలో మహేష్ బాబు చాలావరకు హెల్ప్ చేశాడనే చెప్పాలి…
ఇక విజయ్ ఇంతకుముందు చేసిన సినిమాలేవి కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘వారసుడు’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. అలాగే నెల్సన్ డైరెక్షన్ లో చేసిన బీస్ట్ సినిమా సైతం అతనికి మంచి ఇమేజ్ అయితే సంపాదించి పెట్టలేక పోయింది…