
జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాలపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారని భారత అధికారులు శనివారం తెలిపారు. హీరానగర్ సెక్టార్ పన్సార్ సరిహద్దు ఔట్ పోస్ట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 9.50 గంటల ప్రాంతంలో సరిహద్దు వెంబడి కాల్పులు ప్రారంభమయ్యాయని, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సమర్థవంతంగా దాడులను తిప్పికొట్టిందని పేర్కొన్నారు. శనివారం ఉదయం 3.35 గంటల వరకు ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగాయని, అయితే భారత వైపు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు ఎలాంటి నివేదిక అందలేని తెలిపారు.