
హర్యానా, ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రాల్లోని రైతులు ఢిల్లీలోకి రాకుండా పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గురువారం ‘చలో ఢిల్లీ’కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లోనే అడ్డుకొన్నారు. కొందరు రైతులు రాత్రి వరకు అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ను వదిలారు. అయినా అక్కడే భీష్మించుకు కూర్చొని శుక్రవారం సైతం నిరసన తెలుపుతున్నారు. నిన్నటి వరకు పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి రాగా.. శుక్రవారం ఉత్తర ప్రదేశ్ నుంచి రైతులు తరలివస్తున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలోనే రైతులను ఢిల్లీలోకి అనుమతించడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.