https://oktelugu.com/

గ్రేటర్‌‌ బరి నుంచి జనసేన అందుకే తప్పుకుందా..?  

దుబ్బాక గెలుపుతో బీజేపీలో విజయోత్సాహం కనిపిస్తోంది. అదే ఉత్సాహంతో గ్రేటర్‌‌ బరిలోకి దిగింది. అదే రిజల్ట్‌ను కొనసాగించాలని తహతహలాడుతోంది. అందుకు.. వచ్చని ప్రతి అవకాశాన్నీ వాడుతోంది. అంతేకాదు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ మాత్రం తప్పు చేసినా భారీ మూల్యం తప్పదని జాతీయ నేతలు కూడా రాష్ట్ర ముఖ్యులకు సూచించినట్లుగా సమాచారం. అందుకే.. బీజేపీ కూడా ఎవరికీ అందని వ్యూహాలతో తన పని తాను చేసుకూపోతోంది. గ్రేటర్‌‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 / 12:08 PM IST
    Follow us on


    దుబ్బాక గెలుపుతో బీజేపీలో విజయోత్సాహం కనిపిస్తోంది. అదే ఉత్సాహంతో గ్రేటర్‌‌ బరిలోకి దిగింది. అదే రిజల్ట్‌ను కొనసాగించాలని తహతహలాడుతోంది. అందుకు.. వచ్చని ప్రతి అవకాశాన్నీ వాడుతోంది. అంతేకాదు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ మాత్రం తప్పు చేసినా భారీ మూల్యం తప్పదని జాతీయ నేతలు కూడా రాష్ట్ర ముఖ్యులకు సూచించినట్లుగా సమాచారం. అందుకే.. బీజేపీ కూడా ఎవరికీ అందని వ్యూహాలతో తన పని తాను చేసుకూపోతోంది. గ్రేటర్‌‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఝలక్‌ ఇవ్వాలని చూస్తోంది.

    Also Read: టీఆర్‌‌ఎస్‌పై బీజేపీదే లాస్ట్‌ పంచ్‌!

    గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని చెప్పి.. బరిలోకి దిగేందుకు జనసేన అధినేత పవన్ చెప్పినా.. ఆయన్ను చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పించటానికి పార్టీ అధినాయకత్వం నేరుగా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. తొలుత కొన్ని స్థానాల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని భావించినా.. అది పార్టీకి ఇబ్బందిగా మారుతుందన్న విషయాన్ని గుర్తించిన ఢిల్లీ నాయకత్వం.. వెంటనే రాష్ట్ర పార్టీని అలర్టు చేసినట్లుగా చెబుతున్నారు.

    ఒకవేళ జనసేన బరిలోకి దిగితే అధికారపక్షం భావోద్వేగ అంశాలను తెర మీదకు తీసుకురావటం ఖాయమని.. ఎన్నికల ఎజెండా మారిపోవటంతో పాటు.. ఫోకస్ అంతా అనవసరమైన విషయాల మీదకు వెళ్తుందని పార్టీ అభిప్రాయం. బీజేపీకి లేనిపోని అంశాల్ని అంటించే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. అందుకే.. పోటీ చేస్తామని చెప్పి వెనక్కి తగ్గిన జనసేనకు జరిగే నష్టాన్ని తాము భవిష్యత్తులో పూడుస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ మిత్రపక్షంగా గ్రేటర్ పరిస్థితిని ప్రత్యేకంగా తీసుకోవాలన్న మాటతో పవన్ కల్యాణ్ కూడా కన్విన్స్ అయినట్లు చెబుతున్నారు.

    Also Read: పాతబడిన తెలంగాణవాదం.. తెరపైకి హిందుత్వం

    జనసేన పోటీచేసి గెలిచే స్థానాలు ఉంటాయా? అన్నది సందేహమే అయినప్పుడు.. బీజేపీ గెలుపు అవకాశాల్ని ప్రభావితం చేసేలా పోటీ చేయటం ఎందుకన్న వాదనకు పవన్ కల్యాణ్ అంగీకరించినట్లుగా చెబుతున్నారు. ముందుచూపుతో బీజేపీ అధినాయకత్వం వ్యవహరించటంతో టీఆర్ఎస్ అధినేతకు అవకాశం ఇవ్వకుండా కమలనాథులు జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. పవన్ ను గ్రేటర్ పోటీ నుంచి తప్పించటం ద్వారా.. గులాబీ దళానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదంటున్నారు. మొత్తానికి బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచన రాష్ట్ర నాయకత్వానికి ఎంతగానో మేలు చేసిందని చెప్పొచ్చు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్