
తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై చైనాతో జరిపిన సైనిక, దౌత్యపరమైన చర్చల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం తేలలేదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దుల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోందన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బలగాల మోహరింపును ఉపసంహరించుకునేంది లేదని తేల్చి చెప్పారు. తర్వాతి దఫా చర్చలు ఎప్పుడైనా జరగొచ్చని తెలిపారు. బుధవారం ఓ ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బలగాల మోహరింపు అలాగే కొనసాగడం ఇరు దేశాలు ఏమాత్రం మంచిది కాదని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.