https://oktelugu.com/

నూతన సంవత్సర వేడుకలు వద్దు: శైలజానాథ్

నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకె శైలజానాథ్ పిలుపునిచ్చారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ అనుబంధ బిల్లులకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ శక్తుల అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. అన్నదాతలు రోడ్డు మీదకు వచ్చి ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వంలో కొంత […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 30, 2020 / 06:15 PM IST
    Follow us on

    నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకె శైలజానాథ్ పిలుపునిచ్చారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ అనుబంధ బిల్లులకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ శక్తుల అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. అన్నదాతలు రోడ్డు మీదకు వచ్చి ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వంలో కొంత కూడా చలనం లేకపోవడం దుర్మార్గపు అని మండిపడ్డారు.