చక్రవడ్డీ తప్ప ఏ మియహాయింపు ఇవ్వలేం: కేంద్రప్రభుత్వం

కరోనా సమయంలో మారిటోరియం వినియోగించుకున్న వారికి చక్రవడ్డీ మాఫీ చేశామని, ఇంతకు మించి ఉపశమనాలు ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సమర్పించిన తాజా అఫిడవిట్లో పేర్కోంది. కరోనా కాలంలో ఈఎంఐలు చెల్లించే వారికి ఆరు నెలల మారిటోరియంను రిజర్వు బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని వల్ల భారమేమి పడకున్నా చక్రవడ్డీ చెల్లించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టలో పలు వాజ్యాలు నమోదయ్యాయి. దీంతో కేంద్రప్రభుత్వం రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్నవారికి మారిటోరియం […]

Written By: Suresh, Updated On : October 10, 2020 12:07 pm
Follow us on

కరోనా సమయంలో మారిటోరియం వినియోగించుకున్న వారికి చక్రవడ్డీ మాఫీ చేశామని, ఇంతకు మించి ఉపశమనాలు ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సమర్పించిన తాజా అఫిడవిట్లో పేర్కోంది. కరోనా కాలంలో ఈఎంఐలు చెల్లించే వారికి ఆరు నెలల మారిటోరియంను రిజర్వు బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని వల్ల భారమేమి పడకున్నా చక్రవడ్డీ చెల్లించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టలో పలు వాజ్యాలు నమోదయ్యాయి. దీంతో కేంద్రప్రభుత్వం రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్నవారికి మారిటోరియం కాలంలో విధించే చక్రవడ్డీని మాఫీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే రంగాల వారీగా ఎలాంటి ఉపశమనాలు ఇస్తారో తెలపాలని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా అవి సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.