https://oktelugu.com/

స్టాక్‌ మార్కెట్లలో కొత్త ఏడాది హుషారు

దేశీయ మార్కెట్లు కొత్త ఏడాదిని హుషారుగా ప్రారంభించాయి. సూచీలు గరిష్ఠ సాయిల్లో నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 127 పాయింట్లు లాభపడి 47,879 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 14,016 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.15 వద్ద కొనసాగుతోంది. దాదాపు ఆసియా మార్కెట్లన్నింటికీ ఈరోజు సెలవు దినం. క్రమంగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండడం, అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో కొత్త ఏడాదిలో పరిస్థితులు సాధారణ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 1, 2021 / 10:05 AM IST
    Follow us on

    దేశీయ మార్కెట్లు కొత్త ఏడాదిని హుషారుగా ప్రారంభించాయి. సూచీలు గరిష్ఠ సాయిల్లో నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 127 పాయింట్లు లాభపడి 47,879 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 14,016 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.15 వద్ద కొనసాగుతోంది. దాదాపు ఆసియా మార్కెట్లన్నింటికీ ఈరోజు సెలవు దినం. క్రమంగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండడం, అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో కొత్త ఏడాదిలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న అంచనాలు సూచీల సెంటిమెంటును పెంచాయి.