
దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మిర్చిని పండిస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో మిరప సాగుపై చర్చించామని పేర్కొన్నారు. ఏడాదికి 6200 కోట్ల రూపాయల మిర్చి ఎగుమతి జరుగుతోందన్నారు.ఏఏ దేశాలకు ఎగుమతి చేయాలి, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, మిర్చి రైతులకు మంచి ధర వచ్చేలా ఏ చర్యలు తీసుకోవాలి వంటి పలు అంశాలపై చర్చించామని జీవీఎల్ వెల్లడించారు.