
కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన… మొదటి వేవ్ తో ప్రమాదం ఏమి లేదు…సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర దేశాల నుండి వచ్చిన వారిని ట్రెస్ చేయగా కొంతమందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే అది కొత్త స్ట్రెయిన్ కరోనా లేక పాత కరోనా అన్నది ఇంకా నిర్దారణ కావడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే పెద్ద ప్రమాదంగానే ఉంది..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపారు.