
భారత సంపన్న వ్యక్తుల్తో మొదటి వారైన ముఖేష్ అంబానీ దేవాలయానికి భారీ విరాళాన్ని ప్రకటించాడు. దేశంలో ప్రముఖ కామాఖ్య ఆలయానికి ఆయన 20 కిలోల బంగారాని ఇవ్వబోతున్నాడు. కరోనా కారణంగా ఈ ఆలయం మూసి ఉండేది. కానీ అక్టోబర్ 12 నుంచి మళ్లీ ఆలయాన్ని తెరిచారు. ఈ నేపథ్యంలో ముఖేశ్ అంబాని ఈ దేవాలయానికి దీపావళి గిఫ్ట్‌గా బంగారాన్ని విరాళంగా ఇవ్వబోతున్నాడు. అంబానికి దేశభక్తి ఎక్కువ అని అంటుంటారు. అందులో భాగంగానే తన దైవభక్తిని ఇలా చాటుకున్నారని అందరూ చర్చించుకుంటున్నారు. కాగా 20 కేజీల బంగారం విరాళంపై దేశంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.