ఉత్తరప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల బీఎస్పీకి చెందిన కొందరు ఎమ్మల్యేలు సమాజ్ వాదీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీని ఓడించేందుకు అవసరమైతే బీజేపీకి మద్దతు ఇస్తామని బీఎస్పీ అధినేత మాయావతి ఒక దశలో చెప్పారు. అయితే తాజాగా మాయావతి మళ్లీ ప్రకటన చేశారు. బీజేపీతో ఎలాంటి పొత్తు కుదుర్చుకోమని తేల్చేశారు. మతపరమైన పార్టీతో తమ పార్టీ ఎప్పడుూ జతకట్టదని వెల్లడించారు. మతం, కులం, పెట్టుబడి సిద్ధాంతాలు కలిగిన పార్టీతో బీఎస్పీ తోడు ఉండదన్నారు.