బీజేపీలోకి కుష్బూ.. కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా..

తమిళ, తెలుగు నటి, నాయకురాలు కుష్బు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. పార్టీలోని కొన్ని శక్తులు తనను అణిచివేశాయని అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కుష్బు తన లేఖలో పేర్కాన్నారు. పార్టీలో తనకు సహకరించిన రాజీవ్ గాంధీకి కృతఙ్ఞతలు తెలిపారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరానని, ప్రజల కోసం పనిచేసేందుకే పార్టీలో చేరానన్నారు. అయితే […]

Written By: Suresh, Updated On : October 12, 2020 10:57 am
Follow us on

తమిళ, తెలుగు నటి, నాయకురాలు కుష్బు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. పార్టీలోని కొన్ని శక్తులు తనను అణిచివేశాయని అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కుష్బు తన లేఖలో పేర్కాన్నారు. పార్టీలో తనకు సహకరించిన రాజీవ్ గాంధీకి కృతఙ్ఞతలు తెలిపారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరానని, ప్రజల కోసం పనిచేసేందుకే పార్టీలో చేరానన్నారు. అయితే బీజేపీలో చేరేందుకే ఆమె పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.