భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిచిన కవిత.. ఇక మంత్రి పదవి ఖాయమేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఘనవిజయం సాధించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి జరిగిన ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేసిన సంగతి తెల్సిందే. నేడు ఎమ్మెల్సీ కౌంటింగ్ చేపట్టగా తొలిరౌండ్లోనే ఆమె భారీ మెజార్టీ సాధించడంతో ఆమె గెలుపు ఖాయమైంది. దీంతో టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 824 ఓటర్లు ఉండగా 823మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మేజిక్ […]

Written By: NARESH, Updated On : October 12, 2020 10:41 am
Follow us on


తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఘనవిజయం సాధించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి జరిగిన ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేసిన సంగతి తెల్సిందే. నేడు ఎమ్మెల్సీ కౌంటింగ్ చేపట్టగా తొలిరౌండ్లోనే ఆమె భారీ మెజార్టీ సాధించడంతో ఆమె గెలుపు ఖాయమైంది. దీంతో టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 824 ఓటర్లు ఉండగా 823మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ 413 ఓట్లుకాగా.. ఆమెకు తొలిరౌండ్లోనే అంతకుమించి ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె విజయం ఖాయమైపోయింది. కవితకు ఏకంగా 728ఓట్లు రావడం విశేషం. మిగతావి కాంగ్రెస్, బీజేపీలకు పోలయ్యాయి.

మరికొద్దిసేపట్లో కవిత గెలుపును ధృవీకరిస్తూ ఎన్నికల అధికారులు సంబంధిత పత్రాన్ని అందించనున్నారు. ప్రతిపక్షాల నుంచి కనీస పోటీ లేకుండానే కవిత గెలుపొందటంతో నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే ఉత్సాహంతో దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటుతుందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.

కాగా కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలైంది. నాటి నుంచి ఆమె రాజకీయంగా కొంత సైలంటయ్యారు. తాజాగా కవిత ఎమ్మెల్సీగా గెలుపొందడంతో కేసీఆర్ క్యాబినెట్లో ఆమెకు మంత్రి పదవీ లభిస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే కుమారుడిని సీఎం చేసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. కూతురు భవిష్యత్ ను కూడా బంగారుమయం చేస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!