ఢిల్లీ రైతుల ఆందోళన: నేడు ప్రభుత్వంతో కీలక భేటి

కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు. గత నాలుగు రోజులుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా అవి సఫలీక్రుతం కావడం లేదు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో చర్చలు వాయిదా పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు చర్చలు జరపున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం ఉండే అవకాశం ఉంది. అయితే రైతులు మాత్రం నూతన వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేవరకు ఉద్యమిస్తున్నామంటున్నారు. చట్టాల […]

Written By: Suresh, Updated On : December 5, 2020 10:15 am
Follow us on

కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు. గత నాలుగు రోజులుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా అవి సఫలీక్రుతం కావడం లేదు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో చర్చలు వాయిదా పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు చర్చలు జరపున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం ఉండే అవకాశం ఉంది. అయితే రైతులు మాత్రం నూతన వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేవరకు ఉద్యమిస్తున్నామంటున్నారు. చట్టాల ఉద్దేశ్యం సవ్యంగా లేదని, పూర్తిగా ఉపసంహరణ మినహా కేంద్ర మంత్రులు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టినా అంగీకరించమని పట్టుబడుతున్నారు. మరోవైపు 8న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు.