
ఢిల్లీలో బీజేపీ సారథ్యంలో పని చేస్తున్న నగర పాలక సంస్థల్లో రూ.2,500 కోట్ల కుంభకోణం జరిగిందని రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది 2010 నాటి కామన్‌వెల్త్ గేమ్స్ స్కాం కంటే పెద్దదని చెప్పారు. నగర పాలక సంస్థల్లో అవినీతి గురించి చర్చించాల్సి రావడం చాలా బాధాకరం అని ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అన్నారు. దీనిపై సీబీఐ విచారణను కోరాలని విపక్ష నేత రాంవీర్‌సింగ్ భిదూరీకి సూచించారు. నగర పాలక సంస్థలు అవినీతికి మారుపేరుగా మారాయని, ఢిల్లీ ప్రభుత్వం నిజాయితీగా పని చేస్తున్నదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారని కేజ్రీవాల్ చెప్పారు.