
తమిళనాడు ఎన్నికల్లో యువత పోటీకి ప్రాధాన్యత కల్పిస్తామని.. తమ పార్టీలో యూత్ చేరాలని ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కోరారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ తాజాగా మరో సంచలన పిలుపునిచ్చాడు. అవినీతి రహిత పారదర్శకమైన పాలన కోసం మూడో కూటమిని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించాడు. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసి రావాలని కమల్ పిలుపునిచ్చాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు కోరుతానని కమల్ హాసన్ ఇదివరకే ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం అందరి ఇళ్లకు వెళ్లాలని అనుకుంటున్నట్టు కమల్ తెలిపాడు.