https://oktelugu.com/

రజనీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కమల్

ఈనెల 31న రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన క్రీయాశీల రాజకీయాల్లోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మరో నటుడు కమల్ హాసన్ ఓ పొలిటిక్ పార్టీ ప్రారంభించారు. దీంతో రజనీతో కమల్ పొత్తుపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కమల్ హాసన్ స్పందించారు. రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడే సరికి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు తమిళ భాష […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 16, 2020 / 01:36 PM IST
    Follow us on

    ఈనెల 31న రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన క్రీయాశీల రాజకీయాల్లోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మరో నటుడు కమల్ హాసన్ ఓ పొలిటిక్ పార్టీ ప్రారంభించారు. దీంతో రజనీతో కమల్ పొత్తుపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కమల్ హాసన్ స్పందించారు. రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడే సరికి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు తమిళ భాష మాట్లాడి అధికారంలోకి వచ్చిన వారు తమిళనాన్ని మరిచిపోయారన్నారు. ఇక 2021 తమిళనాడుకు జరిగే ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రానికి రెండో రాజధానికి మధురై ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. బహిరంగ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్ షో ను ప్రారంభించలేదన్నారు.