డబుల్ బెడ్రూం ఇళ్లపై విభిన్నంగా స్పందించిన ఇద్దరు మంత్రులు..!

తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్న సంగతి తెల్సిందే. మరోవైపు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతోంది. ఈక్రమంలోనే మంత్రులు.. ఎమ్మెల్సేలు.. టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కొద్దిరోజులుగా ఫోకస్ పెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు. త్వరలోనే వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్ తోపాటు వరంగల్-ఖమ్మం-మహబూబ్ నగర్.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక రాబోతున్నాయి. దీంతోపాటు జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని శ్రేణులు సిద్ధంగా ఉండాలని […]

Written By: Neelambaram, Updated On : December 16, 2020 1:41 pm
Follow us on

తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్న సంగతి తెల్సిందే. మరోవైపు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతోంది. ఈక్రమంలోనే మంత్రులు.. ఎమ్మెల్సేలు.. టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కొద్దిరోజులుగా ఫోకస్ పెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు.

త్వరలోనే వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్ తోపాటు వరంగల్-ఖమ్మం-మహబూబ్ నగర్.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక రాబోతున్నాయి. దీంతోపాటు జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని శ్రేణులు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

తాజాగా డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇద్దరు మంత్రులు వేర్వుచోట్ల విభిన్నంగా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. మహబూబ్ నగర్లోని జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ డబుల్ బెడ్రూం ఇళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. ‘అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేమని.. దేవుడి దయ ఉంటే పదేళ్ల తర్వాత వస్తాయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ప్రభుత్వం లక్షల ఇళ్లు కట్టడం లేదని.. కట్టే మూడు నాలుగు వేల ఇళ్లనే పేదవారికి లాటరీ ద్వారా ఇస్తామని.. ఇది నిరంతరం కొనసాగుతుందని.. దేవుడి దయ ఉంటే ఇప్పుడు కాకపోయినా.. మరో పదేళ్లకు వస్తుందని’ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుహ్యంగా స్పందించారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్లోని వనస్థలిపురంలో బుధవారం డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రూ. 28.03 కోట్ల వ్యయంతో 324 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇతర రాష్ట్రాల్లోనూ ఏ ప్రభుత్వం నిర్మించ లేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందని కొనియాడారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.9ల‌క్ష‌ల ఖ‌ర్చు పెట్టి నిర్మించిందని తెలిపారు. దాదాపు రూ.50 ల‌క్ష‌ల విలువ చేసే ఫ్లాట్‌ను పేద‌ల‌కు కేసీఆర్ ఇస్తున్నార‌ని చెప్పారు. కాగా డబుల్ ఇళ్లపై ఇద్దరు మంత్రులు విభిన్నంగా స్పందించడం తెలంగాణలో చర్చనీయాశంగా మారింది.