Homeజాతీయం - అంతర్జాతీయంభారత జవాన్లకు చిక్కిన ఉగ్రవాది..

భారత జవాన్లకు చిక్కిన ఉగ్రవాది..

జమ్మూకాశ్మీర్‌లో ఓ ఉగ్రవాదిని భారత జవాన్లు చంపకుండా లొంగదీసుకున్నారు. అతడి నుంచి ఏకే-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 20 ఏళ్ల వయసు ఉన్న ఆ ఉగ్రవాది ఆర్మీ పోలీసులకు కనబడగానే లొంగిపోయేందుకు యత్నించాడు. దీంతో జవాన్లు అతడిని కాల్చమని అభయమిచ్చి లొంగదీసుకున్నారు. ఈనెల 13న ఓ ప్రత్యేక పోలీసు అధికారి రెండు ఏకే -47 తుపాకులతో కనిపించకుండా పోయాడు. అదేరోజు చదూర ప్రాంతంలో జహంగీర్‌ అనే వ్యక్తి కనిపించకుండా పోయినట్లు జవాన్లు వెల్లడించారు. శుక్రవారం జరిపిన ఆపరేషన్‌లో భాగంగా శుక్రవారం జహంగీర్‌ను చుట్టుముట్టిన బధ్రతాబలగాలు అతని తండ్రితో లొంగిపోవాలని చెప్పించారు. దీంతో ఆ యువకుడు పోలీసులు లొంగిపోవడంతో అతని తండ్రి ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version