ట్రైలర్ టాక్: గూస్ బాంబ్స్.. నితిన్ ‘చెక్’ పెడుతున్నాడు

రోమాంటిక్, లవ్ డ్రామా సినిమాలు తీసే హీరో నితిన్ తాజాగా విలక్షణ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ప్రతిసారి టాలీవుడ్ మంచి కాన్సెప్ట్ కథలతో మూవీలు తీసే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటీ తాజాగా నితిన్ తో ఓ వైవిధ్యమైన ఖైదీ కథాంశంతో సినిమాను అనౌన్స్ చేశాడు. Also Read: టాప్ దర్శకుడి చేతికి చిక్కిన నితిన్ నితిన్ హీరోగా.. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘చెక్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు రిలీజ్ అయ్యింది. […]

Written By: NARESH, Updated On : January 3, 2021 12:40 pm
Follow us on

రోమాంటిక్, లవ్ డ్రామా సినిమాలు తీసే హీరో నితిన్ తాజాగా విలక్షణ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ప్రతిసారి టాలీవుడ్ మంచి కాన్సెప్ట్ కథలతో మూవీలు తీసే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటీ తాజాగా నితిన్ తో ఓ వైవిధ్యమైన ఖైదీ కథాంశంతో సినిమాను అనౌన్స్ చేశాడు.

Also Read: టాప్ దర్శకుడి చేతికి చిక్కిన నితిన్

నితిన్ హీరోగా.. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘చెక్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూశాక ఇదో వైవిధ్యమైన కథాంశం అన్న సంగతి అందరికీ అర్థమవుతోంది.

ఒక జైలు గదిలో నితిన్ ను చూపిస్తూ ఈ ఖైదీ అద్భుతంగా చెస్ ఆడుతున్నాడని పరిచయ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. ఈ క్రమంలోనే నితిన్ కు న్యాయమూర్తి ఉరిశిక్ష విధించడం.. పోలీస్ అధికారి దేశద్రోహి అని పిలవడం.. కథలో గొప్ప గొప్ప ట్విస్టులు ఉన్నాయని అర్థమవుతోంది.

Also Read: అనసూయ విరహ వేదన మామూలుగా లేదే?

ఈ సినిమాతో రోమాంటిక్ బాయ్ అయిన నితిన్ లోని కొత్త కోణం ఆవిష్కృతం అయ్యిందని తెలుస్తోంది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వినూత్నమైన కథను ఎంచుకున్నాడని అర్థమవుతోంది.

భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లు. ‘చెక్’ ఫస్ట్ గ్లింప్స్ ఒకసారి చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్