Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలు ధ్వంసం అయ్యాయి. ప్రతిగా పాకిస్తాన్ జరిపిన దాడులను భారత్ తిప్పి కొట్టడంతోపాటు 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. డీజీఎవో అధికారుల చర్చల అనంతరం సీజ్‌ఫైర్ కుదిరింది. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తానే యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటున్నాడు. పదే పదే అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో భారత్ దీనిని ఖండించింది. తాజాగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా వాస్తవం వెల్లడించారు. సీజ్‌ఫైర్‌కు భారత్ ఎలాంటి మూడవ పక్ష జోక్యానికి ఒప్పుకోలేదని తెలిపారు.
అమెరికా జోక్యం లేదనడానికి మరో ఆధారం..
అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను సంప్రదించామన్నారు. అయితే భారత్ దానిని తిరస్కరించిందని రూబియో చెప్పినట్లు పేర్కొన్నారు. మే 10న రూబియో పాకిస్తాన్‌కు సీఫైర్‌తో పాటు ’స్వతంత్ర స్థలంలో ఇండియా–పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతాయి’ అని చెప్పారు. కానీ, జులై 25న వాషింగ్టన్‌లో రూబియోతో జరిగిన సమావేశంలో దార్ మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తగా, రూబియో ’భారత్ ద్వైపాక్షిక అంశమే’ అని స్పష్టం చేశారు. దార్ ప్రకారం, ట్రంప్ ప్రకటనలు పాకిస్తాన్ అభ్యర్థన లేకుండానే వచ్చాయి. పాకిస్తాన్ స్వయంగా సీఫైర్ కోరింది, ఎందుకంటే భారత దాడులు పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరిచాయి. ఈ ఒప్పుకోలు ట్రంప్ యొక్క ’న్యూక్లియర్ వార్‌ను అడ్డుకున్నాను’ అనే క్రెడిట్‌ను ఖండిస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైషంకర్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశంపై భారత్ ఎలాంటి మధ్యవర్తిత్వానికి ఒప్పుకోదని గతంలోనే చెప్పారు.
स्काई न्यूज़ को दिए एक इंटरव्यू में पाकिस्तान के विदेश मंत्री रहे बिलावल भुट्टो ने स्वीकार किया कि आतंकवादियों को पालना पोषना उन्हें मदद देना उनको भारत के खिलाफ इस्तेमाल करना भारत में आतंकवाद फैलाना यह पाकिस्तान की पॉलिसी रही है pic.twitter.com/zvXIkYWl2l
— Jitendra pratap singh (@jpsin1) May 2, 2025
మూడవ పక్ష జోక్యానికి వ్యతిరేకతం..
భారత విదేశాంగ విధానం ఎల్లప్పుడూ ద్వైపాక్షికతపై ఆధారపడుతుంది, ముఖ్యంగా పాకిస్తాన్‌తో సంబంధిత అంశాల్లో. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇది మరింత స్పష్టమైంది. భారత్ ప్రకారం, సీఫైర్ ఇరుదేశాల మధ్య డైరెక్టర్ల జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య నేరుగా ఏర్పడింది. ఎటువంటి బాహ్య ఒత్తిడి లేకుండా. ఈ సందర్భంలో ట్రంప్ ప్రకటనలు భారత్‌కు అసౌకర్యాన్ని కలిగించాయి. తాజాగా దార్ ఒప్పుకోలు భారత వాదనను ధ్రువీకరించింది. ఇది 1972 శాంతి ఒప్పందం నుంచి కొనసాగుతున్నది. భారత్ ఈ సందర్భంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీవ్ర చర్యలు తీసుకున్నప్పటికీ, సమాజిక మాధ్యమాల్లో ట్రంప్ క్రెడిట్ తీసుకోవడంతో దేశీయ రాజకీయాల్లో కూడా చర్చలు రేగాయి. ఇది భారత్‌కు విజయవంతమైన సైనిక ప్రతిస్పందనను మరింత బలపరిచింది, ఎందుకంటే పాకిస్తాన్ స్వయంగా దాని పరాజయాన్ని ఒప్పుకున్నట్లుగా కనిపిస్తోంది.
దార్ ప్రకటన భారత–పాకిస్తాన్ సంబంధాల్లో ముఖ్యమైన మలుపు. పాకిస్తాన్ ఎలాంటి మధ్యవర్తిత్వానికి ఒప్పుకుంటుందని చెప్పినప్పటికీ, భారత్ ద్వైపాక్షిక చర్చలపై దృష్టి పెట్టాలని ఒత్తిడి చేయడం వల్ల, భవిష్యత్ చర్చలు ఉగ్రవాదం, కాశ్మీర్, వాణిజ్యం వంటి అంశాలపై దృష్టి పెట్టవచ్చు.
ट्रम्प और कांग्रेस के सीज़फ़ायर प्रोपेगैंडा पर एक और करारा तमाचा
पाकिस्तान के डिप्टी प्रधानमंत्री व विदेश मंत्री इशाक डार ने साफ कहा
पाकिस्तान ने भारत से बातचीत कराने के लिए किसी तीसरे पक्ष से अनुरोध ही नहीं किया। pic.twitter.com/fTQRamoq38
— Ocean Jain (@ocjain4) August 23, 2025