Mahesh Babu Tweet: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది. ఇంతకు ముందు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేసిన మహేష్ బాబు ఈ సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు తన సినిమాలు తను చేసుకోవడమే కాకుండా తనకి ఏవైనా సినిమాలు నచ్చితే ఆ సినిమాలకు సంబంధించిన టెక్నీషియన్స్ ను ఎంకరేజ్ చేస్తూ ట్వీట్ అయితే చేస్తు ఉంటాడు.
ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ తో వచ్చే మేకర్స్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఇలాంటి ట్వీట్స్ అయితే చేస్తుంటాడు. ఇక రీసెంట్ గా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు లిటిల్ హార్ట్స్ సినిమా చాలా అద్భుతంగా ఉందని ట్వీట్ అయితే చేశాడు.
ఇక అందులో ప్రత్యేకంగా మ్యూజిక్ డైరెక్టర్ అయిన సంజిత్ గురించి మాట్లాడుతూ ‘బ్రదర్ మీరు కొద్దిరోజుల్లో బిజీ అవ్వబోతున్నారు. ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ చేసుకోకండి’ అంటూ ప్రత్యేకంగా సింజిత్ ను మెన్షన్ చేశాడు. మహేష్ బాబు అలా ట్విట్ చేయడానికి గల కారణం ఏంటి అంటూ కొంతమంది కొన్ని కామెంట్లయితే చేస్తున్నారు. నిజానికి సింజిత్ ఇంతకుముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన వీరాభిమానాని చెప్పాడు.
అలాగే మహేష్ బాబు ‘లిటిల్ హార్ట్స్ ‘ సినిమా చూసి ట్వీట్ చేస్తే మాత్రం ఆయన ఆనందానికి అవధులు ఉండవని ఆ ఆనందంలో ఒక వారం రోజులపాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పాడు. దానికి మహేష్ బాబు అతన్ని ఉద్దేశించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోకు అని చెప్పడం మహేష్ బాబు అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను సైతం ఆనందింపజేస్తుంది. అలాగే మహేష్ బాబు లో ఉన్న హ్యూమర్ ని ట్వీట్ ద్వారా కూడా తెలియజేశాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…
#Littlehearts….fun, fresh and big in ❤️❤️❤️the cast is extraordinary…. Especially the young ones.. phew !!! sensatiional actingWhat a joy ride!!! @SinjithYerramil Nuvvu daya chesi phone aapesi yekkadiki vellodhu brother…. It’s going to be really busy for a…
— Mahesh Babu (@urstrulyMahesh) September 16, 2025