India Diwali: దేశంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసారి సుప్రీంకోర్టు ఎటువంటి నిషేధాన్ని అమలు చేయలేకపోవడంతో ప్రజలు స్వేచ్ఛగా బాణాసంచా కాల్చారు. గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని చెప్పినప్పటికీ చాలామంది ప్రజలు ఆ నిబంధనను పట్టించుకోలేదు. పైగా తమకు నచ్చిన బాణసంచ కాల్చడంలో పోటీపడ్డారు. దీంతో దేశం మొత్తం కాంతులతో మెరిసి పోయింది. బాణసంచా వెలుగులతో నిండిపోయింది.
మనదేశంలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో మన వేడుకలు పక్కనే ఉన్న పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించాయి. ఎందుకంటే మన దగ్గర బాణసంచా కాల్చితే.. ఆ పొగ లహర్ నగరాన్ని మొత్తం ఆక్రమించిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. లాహోర్ ప్రాంతంలో పొగ మేఘాలు ఏర్పడ్డాయని.. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించింది. లాహోర్ నగరం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కాలుష్య ప్రాంతంగా పేరు పొందిన విషయం తెలిసిందే. భారతదేశంలో క్రాకర్స్ కాల్చడం వల్ల ఆపోగా లాహోర్ వరకు విస్తరించిందని.. పొగ మేఘాలు ఏర్పడేందుకు కారణమైందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో భారత్, పాకిస్తాన్ నెటిజన్ల మధ్య యుద్ధం జరుగుతోంది.
లాహోర్ నగరంలో పొగ విస్తారంగా ఉండటంతో పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రభుత్వం యాంటి స్మాగ్ గన్స్ ను ఉపయోగిస్తోంది. వీటి ద్వారా పొగను నివారించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. మరోవైపు మనదేశ రాజధాని ఢిల్లీ నగరంలో మంగళవారం కాలుష్యం విపరీతంగా ఏర్పడింది. సోమవారం ఢిల్లీ నగరంలో ప్రజలు స్వేచ్ఛగా బాణసంచా కాల్చారు. దీంతో ఢిల్లీలోని బిజెపి, ఆప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీపావళి వేళ కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆప్ ఆరోపిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం ఈ స్థాయిలో పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఆప్ అని బిజెపి అంటున్నది. పంజాబ్లో రైతులు పంట వ్యర్ధాలను కాల్చివేస్తున్న నేపథ్యంలోనే ఈ స్థాయిలో కాలుష్యం ఏర్పడుతోందని బిజెపి ప్రభుత్వం విమర్శిస్తోంది మీ
దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. మంగళవారం ఉదయం చాణక్య అనే ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 979 గా నమోదయింది. నారాయణ అనే గ్రామంలో 940 గా నమోదయింది. దీంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కాలుష్యం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ బయటకు వస్తే ఎన్ 95, ఎన్ 99 మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.