Homeజాతీయం - అంతర్జాతీయంIndia Assistance To Afghanistan: అఫ్గాన్ లకు సాయం.. పాకిస్తాన్ కి భారత్ ఇలా షాకిస్తోంది?

India Assistance To Afghanistan: అఫ్గాన్ లకు సాయం.. పాకిస్తాన్ కి భారత్ ఇలా షాకిస్తోంది?

India Assistance To Afghanistan: తాజాగా ఆఫ్గానిస్తాన్‌–పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధ ఘట్టాలు మరోసారి ప్రాంతీయ అస్థిరతను బయటపెట్టాయి. పాకిస్తాన్‌ చేసిన వైమానిక దాడులు, ఆఫ్గాన్‌ ప్రతిదాడులతో పరిస్థితి నియంత్రణకు బయటపడింది. ఖతార్‌ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, డ్యూరాండ్‌ లైన్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ ఒప్పందం ఆఫ్గాన్‌ కోపానికి దారి తీసింది. ఈ ఘటన దక్షిణాసియా భద్రతా సమీకరణంపై ప్రభావం చూపే అవకాశముంది.

తాలిబాన్‌ బలహీనతలు..
ఆఫ్గాన్‌ తాలిబాన్‌ ప్రభుత్వానికి సాంకేతికదృష్ట్యా ప్రధానమైన లోటు వైమానిక శక్తి లేకపోవడమే. లాండ్‌ ఆర్మీతో పాకిస్తాన్‌ వైమానిక దాడులను ఎదుర్కోలేకపోతుంది. ఈ పరిస్థితిలో యాంటీ ఎయిర్‌ సిస్టమ్‌లు, ట్యాంక్‌ నియంత్రణ మిసైల్స్‌ కోసం ప్రయత్నించడం ఆఫ్గాన్‌కు అత్యవసరం. కానీ అంతర్జాతీయ గుర్తింపులేమి కారణంగా నేరుగా సహాయం పొందడం అసంభవం.

భారత్‌ పరోక్ష సహకారం..
భారతదేశం ఆఫ్గాన్‌కు నేరుగా సాయం చేసే అవకాశాలు లేవు. ఇందుకు రెండు అడ్డంకులు ఉన్నాయి. ఒకటి ఆఫ్గాన్‌తో భారత్‌కు నేరుగా సరిహద్దు లేదు. రెండోది తాలిబాన్‌ ప్రభుత్వాన్ని ప్రపంచం గుర్తించడం లేదు. భారత్‌ కూడా గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష సాయం చేయలేని పరిస్థితి. అందుకే పరోక్ష సహకారానికి భారత్‌ ప్రయత్నిస్తోంది. ఆఫ్గానిస్తాన్‌ ఉత్తర సరిహద్దు వద్ద ఉన్న తజకిస్తాన్‌లో భారత్‌ నిర్వహిస్తున్న ఫార్కోర్‌ ఎయిర్‌బేస్‌ ఒక కీలక వ్యూహాత్మక స్థావరంగా ఉంది. అక్కడి నుంచి మానవతా సహాయంతో పాటు రక్షణ పరికరాలను కొందరు నాన్‌–స్టేట్‌ గ్రూపులకు మద్దతు ఇవ్వడం సాధ్యమవుతుంది. భారతీయ నాగ్‌ క్షిపణులు లేదా యాంటీ–ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్స్‌ వంటి పరికరాలు తజకిస్తాన్‌ ద్వారా చేరితే, అది పాకిస్తాన్‌కు వ్యూహాత్మక దెబ్బ.

మానవతా, సాంకేతిక సహాయం..
భారత్‌ వైద్యసహాయం, ఆస్పత్రుల నిర్వహణ, ఇంజనీరింగ్‌ సపోర్ట్‌ వంటి మౌలిక సహాయ మార్గాల ద్వారా ఆఫ్గాన్‌ ప్రజలకు చేరగలదు. ఇది మిలిటరీ అబ్జెక్టివ్‌లను పరోక్షంగా బలపరుస్తుంది. టెహ్రాన్, మాస్కో, దోహా వంటి ఆఫ్గాన్‌పై ప్రభావం ఉన్న దేశాలతో కలిసి భారత్‌ తన డిప్లొమాటిక్‌ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఇది పాకిస్తాన్‌ను ఒంటరిగా మారే అవకాశాన్ని పెంచుతుంది.

పాకిస్తాన్‌–తజకిస్తాన్‌ ఘర్షణలు..
తజకిస్తాన్‌–పాకిస్తాన్‌ మధ్య ఉన్న రాజకీయ విభేదాలు ఈ మోడల్‌కు అనుకూలంగా ఉన్నాయి. పాకిస్తాన్‌ ఉత్తర సరిహద్దు వైపునా రక్షణ ఒత్తిడి పెరిగితే, అది దక్షిణ దిశలోని భారత–పాక్‌ సరిహద్దుపై దృష్టి తగ్గించే అవకాశం ఉంది. భారతదేశం తన చేతి జాడ కనిపించకుండా ప్రాంతీయ పీడనాన్ని సవరిసే గుత్తాధిపత్య వ్యూహం పాటించగలదు.

భారత్‌కు వ్యూహాత్మక లాభం
భారత్‌ ఇప్పటివరకు తాలిబాన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోయినా, ఆఫ్గాన్‌ భూభాగ స్థిరత్వం భారత భద్రతకు కీలకమని ఎప్పటినుంచో పేర్కొంటూనే ఉంది. ఆఫ్గాన్‌ పునర్నిర్మాణ ప్రాజెక్టులు, విద్యా–ఆరోగ్య సహకారం ద్వారా భారతం తన ప్రభావాన్ని కొనసాగించగలదు. ఇది ఒక రకమైన ‘‘మోరల్‌ సపోర్ట్‌’’ రూపంలో సాఫ్ట్‌ స్ట్రాటజీగా ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ నేరుగా జోక్యం చేసుకోవడం అనుకూలం కాదు. కానీ తజకిస్తాన్‌ ద్వారానే కాదు, ఉజ్బెకిస్తాన్‌ లేదా ఇరాన్‌ గుండా పరోక్ష మార్గాల్లో సహాయం చేయడం స్మార్ట్‌ నిర్ణయం. ఈ విధానం పాకిస్తాన్‌ను ఆర్థికంగా, సైనికంగా ఒత్తిడిలోకి నెట్టగలదు. భారత వ్యూహం దీర్ఘకాలంలో ‘‘తన చేతికి మట్టి అంటకుండా పాకిస్తాన్‌ను దెబ్బత తీసే అవకాశం ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version