
హర్షల్ పటేల్ హ్యాట్రిక్ తో చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబయి ఇండియన్స్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళరు రెండో ఓవర్లోనే పడిక్కల్ వికెట్ కోల్పోయింది. అయితే కోహ్లీ నిలబడి చక్కని షాట్లు ఆడాడు. అలాగే శ్రీకర్ భరత్ కూడా ధనాధన్ ఇన్నింగ్ ఆడడంతో రెండో వికెట్ కు 68 పరుగులు వచ్చాయి. 9 వ ఓవర్లలో భరత్ ఔటయ్యేటప్పటికి బెంగళూరు స్కోరు 75 గాఉంది.
తర్వాత కోహ్లీ స్పీడ్ గా ఆడకున్నా మ్యాక్స్ వెల్ రెచ్చిపోయాడు. స్విచ్ హిట్లతో రెండు కళ్లు చెదిరే సిక్క్ లు బాదాడు. 16వ ఓవర్లో కోహ్లీ ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 126గా ఉంది. వచ్చి రాగానే డివిలియర్స్ రెచ్చిపోవడంతో తర్వాతి రెండో ఓవర్లలో 30 పరుగులు వచ్చాయి. కానీ చివరి రెండు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా, బౌల్డ్ కేవలం 9 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశారు. దీంతో బెంగళూరు భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లారు. ఛేదనలో ముంబయి దూకుడుగానే ఆరంభించింది. డికాక్ (24) పరుగులు చేశారు.
కానీ పదో ఓవర్లలో మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో భారీ సాట్ కే ప్రయత్నించి రోహిత్ ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. బెంగళూరు కట్టుదిట్టమైన బౌలింగ్ కు ఇసాన్ కిషన్, కృనాల్, సూర్యకుమార్ యాదవ్ త్వరగా ఔటయ్యారు. దీంతో ముంబాయి 15 ఓవర్లకు 99/5 పరుగులతో ఒత్తిడిలో పడింది. చివరి ఐదు ఓవర్లలో ముంబయి 67 పరుగులు మాత్రమే చేసింది. అయితే 17 ఓవర్లో హర్షల్ పటేల్ వరుస బంతుల్లో హార్దిక్, పొలార్డ్, రాహుల్ చాహర్ ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో బెంగళూరు విజయం ఖాయం అయ్యింది.