జడేజా మాయ చేయడంతో ధోని సేన ప్లేఆఫ్ కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ తొలి ఓవర్లోనే శుభ్ మన్ గిల్ రనౌటయ్యాడు. వెంకటేశ్ అయ్యార్ కూడా ఎక్కవ సేపు నిలవలేదు. త్రిపాఠి జోరు కొసాగించినప్పటికీ.. శార్దూల్, జడేజా కట్టదిట్టంగా బంతులేశారు. రసెల్ మెరుపులు మెరిపించానా అది కాసేపే. ఓ దశలో కేకేఆర్ 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది.
కానీ రానాతో తో పాటు దినేష్ కార్తీక్ రెచ్చిపోవడంతో చివరి మూడు ఓవరల్లో ఆ జట్టు 44 పరుగులు రాబట్టింది. అయితే ఛేదనలో దోనీ సేనకు గొప్ప ఆరంభం లభించినా ఆఖర్లో ఉత్కంఠ తప్పలేదు. ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ తొలి వికెట్ కు 74 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. రుతురాజ్ ఔటైనా.. ఉప్లెసిస్, మొయిన్ అలీ బౌండరీలతో అలరించడంతో 11 ఓవర్లకు 101/1 తో లక్ష్యం దిశగా సాగింది. కానీ డుప్లెసిస్ ఔటల్ కావడంతో కథ మారింది.
మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడంతో పాటు రాయుడు వికెట్ తీసిన కేకేఆర్ తిరిగి పోటీలోకి వచ్చింది. తర్వాతి రెండు ఓవర్లలో కేకేఆర్ 14 పరుగులే ఇచ్చి అలీ, రైనా, ధోనీ వికెట్లను తీసింది. కానీ 19 వ ఓవర్లో చివరి నాలుగు బంతులకు వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన జడేజా అద్ధుతమే చేశాడు. దీంతో చివరి ఓవర్లో సీఎస్కేకు నాలుగు పరుగులే అవసరమైనప్పటికీ ఉత్కంఠ తప్పలేదు. మూడో బంతికి మూడు పురుగులు తీసిన శార్దూల్ స్కోరు సమం చేశాడు. కానీ నాలుగో బంతికి పరుగులు చేయని జడ్డూ.. ఆ వెంటనే ఎల్బీగా వెనుదిరిగాడు. కానీ దీపక్ చాహర్ సింగిల్ తో మ్యాచ్ ముగించాడు.