https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ తిట్లకు.. కక్కలేక మింగలేక ఆ ‘మీడియా’ బుక్కైంది

‘అతి సర్వత్రా వర్జయితే’ అంటే ఏది కానీ చేయాల్సినంత చేస్తేనే దానికి అందం చందం.. అతిగా చేస్తే అల్లరి అవుతుంది. ప్రశ్నించనంత వరకూ వాళ్లకు తిరుగు ఉండదు.. కానీ ప్రశ్నించటోడు వస్తే.. గట్టిగా నిగ్గదీసి అడిగితే.. కక్కలేక మింగలేని పరిస్థితి ఏర్పడుతుంది.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు తెలుగు మీడియా పరిస్థితి అలానే తయారైందట.. నిజానికి సినిమా వాళ్లంటే అందరికీ లోకువ. వారిపై బోలెడన్నీ గాసిప్పులను మీడియా ప్రచారం చేసుకుంటుంది.. మీడియాను అడిగే వారే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2021 8:42 pm
    Follow us on

    ‘అతి సర్వత్రా వర్జయితే’ అంటే ఏది కానీ చేయాల్సినంత చేస్తేనే దానికి అందం చందం.. అతిగా చేస్తే అల్లరి అవుతుంది. ప్రశ్నించనంత వరకూ వాళ్లకు తిరుగు ఉండదు.. కానీ ప్రశ్నించటోడు వస్తే.. గట్టిగా నిగ్గదీసి అడిగితే.. కక్కలేక మింగలేని పరిస్థితి ఏర్పడుతుంది.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు తెలుగు మీడియా పరిస్థితి అలానే తయారైందట..

    నిజానికి సినిమా వాళ్లంటే అందరికీ లోకువ. వారిపై బోలెడన్నీ గాసిప్పులను మీడియా ప్రచారం చేసుకుంటుంది.. మీడియాను అడిగే వారే ఉండరు. మనకెందుకు ఈ తలనొప్పి అని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు గమ్మున ఊరుకుంటారు. భవిష్యత్తులో మన సినిమాలు, ఇతర వ్యవహారాలకు ఇబ్బంది అని మీడియా ఏం చేసినా భరిస్తారు.. అవైడ్ చేస్తారు.

    ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మెగా హీరో సాయిధరమ్ తేజ్ విషయంలో మీడియా ఎంత అతి చేసిందో మనం చూశాం. కొన్ని మీడియా సంస్థ‌లు అతిగా క‌థ‌నాలు వండి వార్చాయ‌నే చ‌ర్చ జ‌రిగింది. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయా మీడియా సంస్థ‌ల తీరును ఎండ‌గ‌ట్టారు నెటిజ‌న్లు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మీడియా తీరుపై మండిప‌డ్డారు.  సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌మాదానికి గురైన స‌మ‌యంలో అతి చేసిన కొన్ని మీడియా సంస్థ‌ల‌ను పవన్  ఉతికి ఆరేశారు.

    మీడియా క‌థ‌నాలు ప్ర‌సారం చేయాల్సింది సాయిధర‌మ్ తేజ్ యాక్సిడెంట్ గురించో.. సినిమా వాళ్ల గురించో కాద‌ని పవన్ హితవు పలికారు. పొలిటిక‌ల్ క్రైమ్ గురించి వార్త‌లు రాయాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి ఇలాంటి వార్త‌లు కావాల‌న్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకు హ‌త్య‌కు గుర‌య్యాడు? అన్న విష‌యంపై మీడియా కథ‌నాలు చేయొచ్చ‌న్నారు. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఒక నాయ‌కుడిపై కోడి క‌త్తితో హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌ని, దీని వెనుక పెద్ద కుట్ర ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ కూడా అన్నార‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. మ‌రి, ఆ కుట్ర ఏమైంద‌న్న విష‌యంపైనా మీడియా స్టోరీలు చేయొచ్చ‌న్నారు.ల‌క్ష‌లాది ఎక‌రాల‌ పోడు భూములు పేద‌ల‌కు ఆధీనంలోకి రాకుండా పోతున్న వైనంపైనా క‌థ‌నాలు రాయొచ్చ‌ని, ఆరేళ్ల చిన్నారి దారుణ హ‌త్య‌కు గురైతే.. ఆ విష‌యం వ‌దిలి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డ్డాడంటూ క‌థ‌నాలు చేయ‌డంపై ప‌వ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కొంద‌రు ప్ర‌జ‌ల వెనుక‌బాటు త‌నం, అమ్మాయిల‌పై జ‌రుగుతున్న దాడుల గురించి క‌థ‌నాలు చేయాల‌ని సూచించారు.

    ఇలా కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం కొన్ని మీడియా సంస్థలు పాపం సాయిధరమ్ తేజ్ వాడుకున్నాయని పవన్ ఆరోపించారు. ఆస్పత్రుల్లో కోమాలో ఉన్న సాయిధరమ్ తేజ్ ఎలాగూ స్పందించాడని.. కౌంటర్ ఇవ్వడని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని పవన్  నిప్పులు చెరిగారు.  పవన్ మీడియాను ఇంతలా తిడుతున్న క్రమంలోనే ఆయన ప్రసంగాన్ని నిన్న లైవ్ లో ప్రసారం చేసిన మీడియా ఇరుకునపడింది. ఎందుకంటే లైవ్ ఇచ్చిన మీడియానే అందరికంటే ఎక్కువగా సాయిధరమ్ తేజ్ ను అభాసుపాలుచేసింది. ఇప్పుడు పవన్ మీడియాను తిడుతుంటే దాన్ని ప్రసారం చేస్తూ ఆ మీడియా కక్కలేక మింగలేక ఇరుకునపడింది. ఇలా పవన్ కళ్యాణ్ మాటల దాడితోనైనా తెలుగు మీడియా ఇప్పటికైనా సెట్ అవుతుందా? బుద్ది తెచ్చుకుంటుందా? అన్నది వేచిచూడాలి.