చెన్నైలో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం
నివర్ తుఫాన్ ప్రభావం తమిళనాడుపై పడింది.దీంతో చెన్నైలో బుధవారం భారీ వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా చెన్నై ఎయిర్ పోర్టు లోని విమాన సర్వీసులను రద్దు చేశారు. అటు కేంద్ర పాలిత ప్రాంతం ముందుజాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తమిళనాడులో నేడు సెలవును ప్రకటించారు. చెన్నైలోని చెంబరాంబక్కం సరస్సులో నీటి ప్రవాహం పెరగడంతో రిజర్వాయర్ నుంచి నీటిని […]
Written By:
, Updated On : November 25, 2020 / 02:55 PM IST

నివర్ తుఫాన్ ప్రభావం తమిళనాడుపై పడింది.దీంతో చెన్నైలో బుధవారం భారీ వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా చెన్నై ఎయిర్ పోర్టు లోని విమాన సర్వీసులను రద్దు చేశారు. అటు కేంద్ర పాలిత ప్రాంతం ముందుజాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తమిళనాడులో నేడు సెలవును ప్రకటించారు. చెన్నైలోని చెంబరాంబక్కం సరస్సులో నీటి ప్రవాహం పెరగడంతో రిజర్వాయర్ నుంచి నీటిని కిందికి విడుదల చేశారు.